కామారెడ్డిటౌన్, వెలుగు : ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం ప్రాక్టికల్ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్‌కు సంబంధించిన అంశాలపై అధికారులతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ఇంటర్ పరీక్షల కోసం చీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఫ్లయింగ్ స్వ్కాడ్‌ను నియమించామన్నారు.
సెంటర్లలో కనీస వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సెంటర్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, అంతరాయం ఏర్పడితే వెంటనే సరి చేయాలని సూచించారు. విద్యార్థులు హాల్‌టికెట్లను ఆన్లైన్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన స్కీమ్‌పై చర్చ..
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన మోడల్ విలేజీ స్కీమ్‌లో భాగంగా భిక్కనూరు మండల కేంద్రంలో చేపట్టనున్న సోలార్ ప్రాజెక్టుపై అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చర్చించారు. అధికారుల కమిటీ రిపోర్టు కలెక్టర్‌కు అందించారు. భిక్కనూరులోని 28 ప్రభుత్వ భవనాలపై సోలార్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు కోసం పరిశీలించామని తెలిపారు. 116 కిలో వాట్స్ సామర్థ్యం సిస్టమ్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
ప్రజావాణికి 91 ఫిర్యాదులు..
కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 91 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆశిష్సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతర అధికారులతో నిర్వహించిన మీటింగ్‌లో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు క్షుణంగా పరిశీలన చేసి పరిష్కరించాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు వెంటనే మార్కవుట్ ఇవ్వాలన్నారు. భూభారతి, ప్రజావాణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు.
