
కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో రైతులు వరి సాగుకు బదులుగా ఆయిల్ పామ్ సాగు చేస్తే మేలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం బీబీపేట మండలం యాడారంలో ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగులో లేబర్ ఖర్చు తక్కువగా ఉంటుందని, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌తో తక్కువ నీటితో సాగు చేయవచ్చన్నారు. దిగుబడి కూడా బాగానే ఉంటుందని, జిల్లాకు ఇచ్చిన టార్గెట్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ జ్యోతి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. యాడారంలో ఆయిల్ పామ్ మొక్కలను కలెక్టర్ నాటారు.
మాక్ డ్రిల్‌లో ఆయా శాఖల అధికారులు పాల్గొనాలి
వర్షకాలంలో వరదలు, విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అలర్ట్చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాక్ డ్రిల్ చేపట్టనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో మీటింగ్ నిర్వహించారు. జీవదాన్ స్కూల్, జీఆర్ కాలనీ ఏరియాలో నిర్వహించే మాక్ డ్రిల్‌లో ఆయా శాఖల అధికారులు పాల్గొనాలన్నారు. అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రావణ్‌కుమార్, ఆర్అండ్బీ ఈఈ రవిశంకర్, డీపీవో మురళీ, జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్ పాల్గొన్నారు.