విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలి : కలెక్టర్‌‌ ఆశిష్‌‌ సంగ్వాన్‌‌

విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలి  : కలెక్టర్‌‌ ఆశిష్‌‌ సంగ్వాన్‌‌

కామారెడ్డి, వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని కలెక్టర్‌‌ ఆశిష్‌‌ సంగ్వాన్‌‌ అన్నారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలోని పోర్టు ప్రాంగణంలో అర్చరీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఆటలు మానసిక ఆనందాన్ని ఇస్తాయని, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయన్నారు. 

అనంతరం బాయ్స్‌‌ హైస్కూల్‌‌ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.  మండల స్పెషల్‌‌ ఆఫీసర్‌‌ జ్యోతి, తహసీల్దార్‌‌ సుధాకర్‌‌, ఎంపీడీవో ప్రవీణ్‌‌, ఎంఈవో విజయ్‌‌కుమార్‌‌, ఏవో మౌనిక  పాల్గొన్నారు. 

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు  అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌‌ ఆశిష్‌‌ సంగ్వాన్‌‌ సూచించారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల నోడల్‌‌ అధికారులతో సమావేశం నిర్వహించి, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌‌ చందర్​, అధికారులు పాల్గొన్నారు.  

మట్టి గణపతులను పూజిద్దాం..

మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని కలెక్టర్‌‌ ఆశిష్‌‌ సంగ్వాన్‌‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌‌లో జనహిత గణేశ్​మండలి ఆధ్వర్యంలో ఉద్యోగులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. టీజీవో అధ్యక్షుడు, కార్యదర్శులు దేవేందర్‌‌, సాయిరెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు, కార్యదర్శులు వెంకట్‌‌రెడ్డి, నాగరాజు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.