ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సమస్య లేదు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సమస్య లేదు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక, మొరం సమస్య  లేదని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం రాజంపేట  మండలంలోని ఆర్గొండలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణ పనులను పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ 27 ఇండ్లు మంజూరు కాగా, 16 ఇండ్లకు మార్కవుట్ ఇవ్వగా 7 బేస్మిట్ లేవల్​కు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. 

 8 మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో  నిర్మాణాలు చేపట్టలేదన్నారు.  అనంతరం  ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్ పరిశీలించారు. మిడ్​ డే మీల్స్​ తనిఖీ చేశారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. హౌజింగ్ పీడీ  జయపాల్​రెడ్డి, డీఈవో రాజు తదితరులు ఉన్నారు.