
బీర్కూర్, వెలుగు : బీర్కూర్ మండలం చించెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారికి పక్కన అనుమతి లేకుండా వెంచర్ ఏర్పాటు చేశారు. వెంచర్ కోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆఫీసర్లు సమాధానం ఇస్తున్నారే తప్పా..? ఆ వెంచర్లో ఎలాంటి బోర్డు పెట్టడం లేదు.
దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు మోసపోయి స్థలాలు కొనే అవకాశం ఉంది. ఈ విషయమై ఎంపీడీవో మహబూబ్‌ను వివరణ కొరగా అనుమతి లేని వెంచర్లో బోర్డు పెట్టాలని సెక్రటరీకి సూచించామని తెలిపారు.