నకిలీ విత్తనాలపై ఫోకస్​ పెట్టండి : కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్

నకిలీ విత్తనాలపై ఫోకస్​ పెట్టండి : కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాపై ఫోకస్ పెట్టాలి.. అగ్రికల్చర్, పోలీసు శాఖ  అధికారులతో కలిసి టాస్క్​ఫోర్స్ టీమ్ తనిఖీలు చేయాలి.. బిచ్​కుంద డివిజన్​లో నకిలీ విత్తనాలపై నిఘా పెట్టాలి’ అని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో అగ్రికల్చర్, హార్టికల్చర్, డీఆర్డీవో అధికారులతో నిర్వహించిన రివ్యూలో కలెక్టర్​ మాట్లాడారు.  ఖరీఫ్ సీజన్​లో జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయని, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. 

పెద్దకొడప్ గల్​ మండలంలో రైతు బీమా చెల్లింపుల డాక్యుమెంట్స్ అప్​లోడ్​లో డీలే జరుగుతుందన్నారు.   వడగండ్ల వానలకు జిల్లాలో 193 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నిర్ధేశించిన లక్ష్యం మేర 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో సురేందర్, జిల్లా అగ్రీకల్చర్​ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా హార్టికల్చర్ అధికారి  జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 

ఇసుక లభ్యతపై మీటింగ్ 

 డిస్ర్టిక్​ లెవల్ సాండ్ కమిటీ మీటింగ్ బుధవారం జరిగింది.  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ మాట్లాడుతూ స్థానిక అవసరాల కోసం హస్గుల్, కుర్లా లలో ఇసుక లభ్యత, స్థానిక  తహసీల్ధార్​  పర్మిషన్​పై చర్చించారు.  ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు చెక్​పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్,  అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి,   జిల్లా గ్రౌండ్ వాటర్​ అధికారి సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.