
- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీ, రామారెడ్డి రోడ్డు, సిరిసిల్లా రోడ్డులో శానిటేషన్ పక్రియను పరిశీలించి మాట్లాడారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. డ్రైనేజీలు క్లీన్ చేయించి, దోమలు వ్యాప్తి చెందకుండా అయిల్ బాల్స్ వేయాలన్నారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయించాలని కమిషనర్ రాజేందర్‌రెడ్డిని ఆదేశించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలన్నారు. అడిషనల్ కలెక్టర్ చందర్‌నాయక్ తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్ చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టినందున అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ చందర్‌నాయక్, హౌజింగ్ పీడీ విజయపాల్‌రెడ్డి, డీపీవో మురళీ పాల్గొన్నారు.