ఐటీఐల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో చేరండి : కలెక్టర్ భాస్కర్రావు

 ఐటీఐల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో  చేరండి : కలెక్టర్ భాస్కర్రావు

యాదాద్రి, వెలుగు : ఐటీఐల్లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్​టెక్నాలజీ సెంటర్లలో యువత చేరాలని అడిషనల్​ కలెక్టర్ భాస్కర్​రావు కోరారు. ఆలేరు, భువనగిరి ఐటీఐల్లో ప్రవేశాల కోసం రూపొందించిన పోస్టర్లను సోమవారం భువనగిరిలో ఆయన విడుదల చేశారు.

 ఐటీఐలో 2025-–27 ఎడ్యుకేషన్​ ఇయర్​లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్,  ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, బేసిక్ డిజైనర్ మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి కోర్సులు ఉన్నాయని వివరించారు. అడ్మిషన్ల కోసం  https//iti.telangana.gov.in లో అప్లయ్ చేసుకోవాలని సూచించారు.