తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దల పునరుద్ధరణ, జాతర అభివృద్ధి పనులను, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూచించారు.
శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, ప్రధాన ద్వారానికి సంబంధించిన భారీ రాతి స్తంభాలను వాటి నిర్మాణ పనులను వారు వేర్వేరుగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు ఎస్పీ వనదేవతలను దర్శనం చేసుకున్నారు.
