ప్రభుత్వ, సీలింగ్‌‌‌‌ భూములను ..గూగుల్‌‌‌‌ మ్యాప్‌‌‌‌లో నమోదు చేయాలి : గౌతమ్

ప్రభుత్వ, సీలింగ్‌‌‌‌ భూములను ..గూగుల్‌‌‌‌ మ్యాప్‌‌‌‌లో నమోదు చేయాలి :  గౌతమ్

శామీర్ పేట, వెలుగు :  ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు అన్నింటిని గుర్తించి గూగుల్ మ్యాప్ లో నమోదు  చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్  గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  బుధవారం వీసీ మీటింగ్‌‌‌‌ హాల్​లో ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో  సమీక్ష సమావేశం నిర్వహించారు.  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్న సీలింగ్ భూములు అన్నింటిని ధరణిలో క్రయ విక్రయాలు జరగకుండా చూడాలన్నారు.  

కోర్టు కేసులు పెండింగ్‌‌‌‌లో ఉన్నా వాటిని కౌంటర్ ఫైల్  చేయమని తహసీల్దార్లను ఆదేశించారు.   హౌసింగ్ బోర్డు ల్యాండ్‌‌‌‌లను కాపాడాలన్నారు.  మండల పరిధిలోని పెండింగ్‌‌‌‌లో ఉన్న టీఎస్ బీ పాస్ దరఖాస్తులను పరిశీలించి పంపాల్సిందిగా కోరారు.  కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్‌‌‌‌, మండల తహశీల్దార్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.