ములుగు, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం మండలంలోని క్షీరసాగర్, జడ్పీ హైస్కూల్, ఒంటిమామిడి ప్రైమరీ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. మెనూ ప్రకారం కాకుండా అన్నం, కూర మాత్రమే వండినందుకు ఒంటిమామిడి స్కూల్సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాంబార్ చేయకుండా ఒక కూర విద్యార్థులకు సరిపోతుందా అని ప్రిన్సిపాల్ పైన మండిపడ్డారు. వంటగది పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, వంట సిబ్బందిని ఆదేశించారు. తరగతికి వెళ్లి కాసేపు విద్యార్థులతో మాట్లాడారు.
