సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి అని కలెక్టర్హైమావతి అన్నారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల నుంచి 200 వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 31 దరఖాస్తులు
సంగారెడ్డి టౌన్: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ పద్మజారాణితో కలిసి ప్రజలు నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు. మొత్తం 31 దరఖాస్తులు స్వీకరంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీఆర్డీవో పీడీ జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
మెదక్ టౌన్: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్లో అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 75 దరఖాస్తులు రాగా వాటిలో భూభారతి 34, పెన్షన్14, ఇందిరమ్మ ఇండ్లు 5, ఇతర 26 దరఖాస్తులు ఉన్నాయని చెప్పారు. ఆయన వెంట అధికారులు భుజంగ రావు, ఎల్లయ్య, శ్రీనివాస్ రావు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. అనంతరం భారత స్కౌట్స్ అండ్ గౌడ్స్ వారోత్సవాల్లో భాగంగా స్టిక్కర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి రాజేందర్, నాగరాజు, జ్యోత్స్య పాల్గొన్నారు.
