స్కూల్స్, హాస్టల్స్లో మెడికల్ క్యాంప్లు నిర్వహించాలి : కలెక్టర్ హనుమంతరావు

స్కూల్స్, హాస్టల్స్లో మెడికల్ క్యాంప్లు నిర్వహించాలి : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు : స్కూల్స్, హాస్టల్స్​లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్​హనుమంతరావు వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో నిర్వహించిన వైద్యారోగ్య శాఖ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ప్రతి స్టూడెంట్​కు వైద్య పరీక్షలు చేయాలన్నారు. హాస్టల్స్​కు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్​కు హోమ్ సిక్​ ఉంటుందని, అలాంటి వారిని కలిసి మాట్లాడి, కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. పీహెచ్​సీ, సీహెచ్​సీల్లో డాక్టర్లు ఎప్పటికీ అందుబాటులో ఉండాలని సూచించారు.

 అనంతరం గర్భిణులకు నార్మల్​ డెలివరీ గురించి వివరించాలని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్​వో డాక్టర్​మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్​వో యశోద, ప్రోగ్రాం ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలు సాయి శోభ, శిల్పిని, రామకృష్ణ, సుమన్ కల్యాణ్, అంజయ్య పాల్గొన్నారు.