వడ్ల కొనుగోలు కంప్లీట్ చేయండి : కలెక్టర్ హనుమంతరావు

వడ్ల కొనుగోలు కంప్లీట్ చేయండి : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు: వడ్ల కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. రామన్నపేట మండలం తుమ్మల గూడెంలో ఐకేపీ కొనుగోలు సెంటర్​ను తనిఖీ చేశారు. సెంటర్​లోని వడ్లను పరిశీలించి కొనుగోలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతోందని ప్రశ్నించారు. ఆలస్యం చేయకుండా వెంటనే  వడ్లను కాంటా వేసి కొనుగోలు పూర్తి చేయాలన్నారు. వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. 

ఇప్పటి వరకు కొనుగోలు చేసినంత వరకు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశారా అని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఉండకుండా ఎప్పటికపుడు ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలన్నారు.ట్యాబ్ ఎంట్రీలు పూర్తయిన రైతుల అకౌంట్ లలో డబ్బులు జమ అయ్యాయా అని ఆయన అడిగి తెలుసుకున్నారు.