
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కలెక్టరేట్ఆవరణలోని కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి కలెక్టర్ హరిచందన బోనం సమర్పించారు. మరోవైపు అమీర్ పేటలోని శిశువిహార్ ను జోనల్ కమిషనర్ హేమంత్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు. పిల్లలకు సమయానికి నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించారు.
పిల్లల సంఖ్య, దత్తత ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కలెక్టరేట్ లోని జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ శిబిరంలో 50 మంది జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఉద్యోగులు, లైసెన్సు ట్రైనింగ్ పొందుతున్న అభ్యర్థులు, రక్త దానం చేశారు.