పంద్రాగస్టుకు ఏర్పాట్లు చేయండి: జిల్లా కలెక్టర్ హరీశ్

పంద్రాగస్టుకు ఏర్పాట్లు చేయండి: జిల్లా కలెక్టర్ హరీశ్

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: పంద్రాగస్టు వేడుకలను అన్ని ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. బుధవారం కొంగరకలాన్ లోని కలెక్టరేట్ లో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించే వేడుకల్లో వీఐపీలు, అధికారులు, మీడియా, ఇతరులకు సీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. 

వేడుకలకు వచ్చే అతిథులకు పోలీసు గౌరవ వందనంతో పాటు బందో బస్త్ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగొద్దని కలెక్టర్ స్పష్టంచేశారు.