బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం భీంగల్ మండల పరిషత్ ఆఫీస్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. చేతి పంపులు, బోరుబావులు తక్షణం రిపేర్ చేయించాలని, వాటర్ ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, అంగన్‌వాడీలు, పాఠశాలలు, హాస్టళ్కు నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జూన్‌లో స్కూళ్లు తెరుచుకునేసరికి నీటి సమస్య ఉండొద్దన్నారు. అనంతరం గోన్‌గొప్పుల హైస్కూల్ గ్రౌండ్‌లో పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అదనపు తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ఓ ప్లాంట్ ఉండేలా స్కూల్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ,ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ ఈ రాజేందర్, డీపీవో శ్రీనివాస్ రావు,మిషన్ భగీరథ ఈఈ రాకేశ్ పాల్గొన్నారు.

