నిజామాబాద్, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో నోడల్ ఆఫీసర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో నోడల్ అధికారులతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, అప్పగించే బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చాలన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని, శాఖల మధ్య సమన్వయం ముఖ్యమని సూచించారు.
సబ్ కలెక్టర్లు వికాస్మహాతో, అభిగ్యాన్ మాల్వియా, ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక కమిషనర్ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తరువాత నిర్వహించిన మరో మీటింగ్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కస్తూర్బా, నర్సింగ్ స్కూల్, హెల్త్ సబ్ సెంటర్స్, అంగన్వాడీ, లైబ్రరీల నిర్మాణాలకు స్థలాలు గుర్తించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. సర్కార్ జాగాలు ఆక్రమణకు గురైతే అక్కడి ఆఫీసర్లను బాధ్యులను చేస్తామని పేర్కొన్నారు.
