సంగారెడ్డి టౌన్, వెలుగు: అకాల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించొదన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆదేశాల మేరకు నడుచుకోవాలని సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
కొంతమంది బీఎల్వోలు ఆన్లైన్యాప్ లో ఇప్పటికీ లాగిన్ కాలేదని ఇలాంటి సమస్యలు పునరావృతం కావద్దని సూచించారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి కలెక్టరేట్ కు వచ్చే ఫైళ్లలో పూర్తి సమాచారం ఉండాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజారాణి, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
