మునగసాగుతో అధిక ఆదాయం.. : కలెక్టర్ జితేశ్

మునగసాగుతో అధిక ఆదాయం.. : కలెక్టర్ జితేశ్
  • జాతీయ స్థాయి సెమినార్​లో కలెక్టర్ జితేశ్​ ​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పత్తి పంట కంటే మునగ సాగుతో రైతులకు ఆదాయం ఎక్కువగా వస్తుందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో ఆస్పిరేషనల్​డిస్ట్రిక్ట్​ అండ్​ బ్లాక్స్​పై గురువారం నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్​లో ఆయన జిల్లాలో చేపడుతున్న మునగ సాగుపై వివరించారు. మునగ సాగు వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించడంతో వారు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 415 ఎకరాల్లో మునగ సాగు అవుతుందని చెప్పారు. అంతరపంటగానూ మునగ సాగును రైతులు చేపడుతున్నారన్నారు.