గోదావరి తీరాన సాంస్కృతిక వేడుకలు..ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ జితేశ్

గోదావరి తీరాన సాంస్కృతిక వేడుకలు..ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ జితేశ్

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం గోదావరి తీరంలో ఏరు ఉత్సవాల్లో సాంస్కృతిక వేడుకలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ మేరకు తెప్పోత్సవం నిర్వహించే ర్యాంపు సమీపంలో స్థానిక చిన్నారులతో కూచిపూడి, భరత నాట్యం లాంటి శాస్త్రీయ నృత్యాలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ ఈవెంట్​ నిర్వాహకులతో కలిసి ఏర్పాట్లను శుక్రవారం గోదావరి స్నానఘట్టాల వద్ద పర్యవేక్షించారు. 

ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తులకు కనుల, వీనుల విందు చేయడం లక్ష్యంగా కలెక్టర్​ ప్రోగ్రామ్​లు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరికి నదీహారతులు కూడా నిర్వహించనున్నారు. ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక వేడుకలతో భక్తులను మైమరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.