కేజీబీవీలను బలోపేతం చేయాలి : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్

కేజీబీవీలను బలోపేతం చేయాలి :  కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్ 

పాల్వంచ, వెలుగు : కేజీబీవీల బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్నామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​వీ పాటిల్ అన్నారు. గురువారం పాల్వంచలోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్ లైన్ క్లాసుల  పనితీరుతోపాటు విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రాంగణంలో మొక్కలు నాటకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యా సంస్థకు అవసర మైన కూరగాయలు పండించు కునే అవకాశం ఉన్నా ఎండుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఖాన్ అకాడమీ నిర్వహణలో 6 నుంచి 12వ తరగతి వరకు భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితం తదితర సబ్జెక్టుల ఆన్ లైన్ క్లాసులను వినియోగించుకొని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు ఆయన సూచించారు.

 పాల్వంచలో ప్రారంభమైన మన్మో హన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీలో పెట్టాల్సిన కోర్సుల గురించి ప్రణాళిక జరుగుతుందని తెలిపారు. కొత్త భవిత సెంటర్ల శాంక్షన్ కోసం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్ర టరీని కోరినట్లు తెలిపా రు. కలెక్టర్ వెంట డీఈవో వెంకటేశ్వరాచారి, సమ్మిళిత కో ఆర్డినేటర్ నాగరాజశేఖర్, మొబిలైజేషన్ అధికారి ఎస్ కె.సైదులు బాలిక విద్య కోఆర్డినేటర్ జే.అన్నామణి, విద్యాసాగర్ పలువురు ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.