
- భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
చండ్రుగొండ,వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామ శివారులో గల కనకగిరి గుట్టలు టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కలెక్టర్ కనకగిరి గుట్టల పై మార్నింగ్ వాక్ చేశారు. గుట్టల పై ఉన్న చెక్ డ్యాంలను పరిశీలించి హస్తాల వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
కలెక్టర్ వెంట బెండాలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నపిల్లలు మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. పిల్లలతో కలెక్టర్ సరదాగా సందడి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కనకగిరి గుట్టలను టూరిజం స్పాట్ గా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ వెంట దిశ కమిటీ సభ్యులు బొర్రా సురేశ్, సీనియర్ నాయకులు భోజ్యానాయక్, నాగరాజు, గోపాలకృష్ణ ఉన్నారు.