మెడికల్ కాలేజీ పనులు కంప్లీట్​ చేయాలి : కోయ శ్రీహర్ష

మెడికల్  కాలేజీ పనులు కంప్లీట్​ చేయాలి : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు; జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్​ కాలేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన క్లాస్​రూమ్స్, ప్రిన్సిపాల్, వైస్  ప్రిన్సిపాల్, లైబ్రరీ, ల్యాబ్ లు, వివిధ విభాగాల కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. 

అంతకుముందు కలెక్టరేట్​లో ఓటరు జాబితాపై వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డబుల్  ఓటర్లను పూర్తిగా తొలగించామని, పేరు, చిరునామా, పుట్టిన తేది వివరాలను సరి చేసినట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు  ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నారాయణపేట నియోజకవర్గంలో 977, మక్తల్  నియోజకవర్గంలో 950 డబుల్ ఓటర్లను తొలగించామన్నారు. అడిషనల్​ కలెక్టర్​ మయాంక్​ మిత్తల్  పాల్గొన్నారు.