ధాన్యం కొనుగోలు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ మనుచౌదరి

ధాన్యం కొనుగోలు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ మనుచౌదరి

గజ్వేల్ వెలుగు: ధాన్యం కొనుగోలు ప్రక్రియ స్పీడప్​చేయాలని కలెక్టర్​మనుచౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కుకునూరుపల్లి మండలం తిప్పారం, గజ్వేల్ మండలం సింగాటం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. అకవాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లు ఎక్కువ మొత్తంలో ఉంచుకోవాలన్నారు.

మిగిలిన ధాన్యం తేమశాతం రాగానే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు.  రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా అధికారులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.  కలెక్టర్ వెంట డీఆర్డీవో జయదేవ్ ఆర్య, సివిల్ సప్లై డీఎం ప్రవీణ్, అడిషనల్ డీఆర్డీవో మధుసూదన్, ఆయా మండలాల తహసీల్దార్లు సుజాత, శ్రవణ్ ఉన్నారు.