సిద్దిపేట ఏరియా హాస్పిటల్ లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలి : మను చౌదరి

 సిద్దిపేట ఏరియా హాస్పిటల్ లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలి : మను చౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట ఏరియా హాస్పిటల్ లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ మనుచౌదరి డాక్టర్లకు సూచించారు. మంగళవారం ఆయన హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. అనంతరం కలెక్టర్ ​మాట్లాడుతూ.. ప్రజలు ప్రైవేట్​హాస్పిటల్స్​కు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రసూతి వార్డ్ ని పరిశీలించి సాధ్యమైనంతవరకు సాధారణ ప్రసవాలు చేయాలన్నారు. సానిటేషన్ రెగ్యులర్ గా నిర్వహించి ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ కిషోర్ కూమార్, ఆర్ఎం సదానందం, ఆయా విభాగాల డాక్టర్లు ఉన్నారు.

మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేయాలి

సిద్దిపేట టౌన్: మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్​మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించి కార్యక్రమం అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మహిళా శక్తి పాలసీ ద్వారా 2024,-25 ఆర్థిక సంవత్సరానికి రూ.189 కోట్ల 12 లక్షలు లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయించారన్నారు.

మహిళలకు పాడి గేదలు, ఆవులు, పెరటి కోళ్లు, పౌల్ట్రీ మదర్ యూనిట్, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్​లెట్​, మిల్క్ పార్లర్, మీసేవ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, మిల్క్ పార్లర్స్, స్టిచ్చింగ్ సెంటర్స్, ఈవెంట్ మేనేజ్​మెంట్, ఎంఎస్ క్యాంటీన్లు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్​మెంట్​, సోలార్ యూనిట్స్ అందిస్తారని తెలిపారు.