మీడియా సెంటర్ ద్వారా వివరాలు అందించాలి : కలెక్టర్ మనుచౌదరి

మీడియా సెంటర్ ద్వారా వివరాలు అందించాలి : కలెక్టర్ మనుచౌదరి
  •     కలెక్టర్లు మనుచౌదరి, క్రాంతి

సిద్దిపేట రూరల్, వెలుగు : మీడియా సెంటర్ ద్వారా ఎన్నికల వివరాలు అందించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో లోక్​సభ ఎన్నికల మీడియా సెంటర్ ను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీవిజిల్ యాప్​ ద్వారా వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు. అనంతరం నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్, సీ విజిల్​ సెంటర్ ను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రహమాన్, ఎలక్షన్​ సూపరింటెండెంట్ మధుసూదన్ పాల్గొన్నారు.  

5 కే రన్ ప్రారంభం

 లోక్ సభ ఎన్నికల ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానం నుంచి 5కే రన్​ కార్యక్రమాన్ని కలెక్టర్ మను చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా కీలకమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, డీఆర్డీవో జగదేవ్ పాల్గొన్నారు.   

సంగారెడ్డిలో..            

సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన మీడియాసెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి, అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్ తో  కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్లమెంట్​ఎన్నికలకు సంబంధించిన  సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్  ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు.  

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు.  సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్​వో పద్మజారాణి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఏడుకొండలు, ఏవో పరమేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు