కొండపోచమ్మ సాగర్ ను విజిట్ చేసిన కలెక్టర్

కొండపోచమ్మ సాగర్ ను విజిట్ చేసిన కలెక్టర్

ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్​ రిజర్వాయర్​ను కలెక్టర్​మనుచౌదరి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ సాగర్​ఎస్ఈ వేణు రిజర్వాయర్​ నిర్మాణ విశేషాలను, ప్రాజెక్ట్ కెపాసిటీ, భూసేకరణ, కాల్వల వివరాలను తెలియజేశారు. అంతరం కలెక్టర్ ములుగు మండలంలో  ఏర్పాటు చేసిన  కొండపోచమ్మ నిర్వాసిత మామిడ్యాల పునరావాస కాలనీని సందర్శించి తాత్కాలికంగా నిర్మించిన ఇండ్లను పరిశీలించారు. 

ఈ సందర్భంగా నిర్వాసితులు తాత్కాలిక ఇండ్లు నివాసానికి అనుకూలంగా లేవని ఈదురుగాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోతున్నాయని, విద్యుత్ సరఫరా సరిగా లేదని కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ పునరావాస కేంద్రం వద్ద ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలంలో లే అవుట్ చేసి మామిడ్యాల గ్రామానికి చెందిన 37 కుటుంబాలతో పాటు ఇతర గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఉపయోగపడేలా వంద ప్లాట్లను సిద్దం చేయాలని ఆర్డీవో బన్సీలాల్, తహసీల్దార్​ప్రవీణ్ ను ఆదేశించారు.