ఎరువులను చల్లే డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఎరువులను చల్లే డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : సాగులో రైతులు టెక్నాలజీని వినియోగించుకొని లాభాలు సాధించవచ్చని పెద్దపల్లి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముజమ్మిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. గురువారం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఎరువులను చల్లే డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కూలీల కొరత కారణంగా రైతులు టెక్నాలజీ వైపు మళ్లాలని, దీని వల్ల ఖర్చు, టైం ఆదా అవుతాయన్నారు.  

కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంట అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఆదిరెడ్డి, బి.రాంబాబు ఉన్నారు. అంతకుముందు కమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం సుందిల్ల గ్రామ శివారులోని రామగుండం డంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డు ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. అంతర్గాం మండలం గోలివాడ వద్ద గోదావరినది ఒడ్డున నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంతాన్ని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్శించారు.