పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

లింగంపేట, వెలుగు:  వర్షాలకు దెబ్బతిన్న వంతెనలు, రహదారుల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం లింగంపల్లి గ్రామం వద్ద వరదలో కొట్టుకుపోయిన పాములవాగు వంతెన, నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు, మెదక్–బోధన్ ప్రధాన రహదారిపై ధ్వంసమైన వంతెనలను పరిశీలించి మాట్లాడారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి రూట్‌‌‌‌‌‌‌‌లో  వంతెనలు,  రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ ఈఈ మోహన్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.  పంట నష్టం వివరాలను సేకరించాలని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డికి సూచించారు.

మరమ్మతులకు ప్రతిపాదనలు పంపిస్తాం..

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు సైడ్‌‌‌‌‌‌‌‌వాల్ మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. అధిక వర్షాల వల్ల ప్రాజెక్టు సైడ్‌‌‌‌‌‌‌‌వాల్ కొంతమేర దెబ్బతిన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పోచారం ప్రాజెక్టుకు ఎలాంటి భయం లేదన్నారు. కూలిన ఇండ్ల వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ వెంకటేశ్వర్లు, లింగంపేట తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో నరేశ్​, ఆర్‌‌‌‌‌‌‌‌ఐ కిరణ్ పాల్గొన్నారు.

వరద నష్టం పై సర్వే చేపట్టండి..

తాడ్వాయి, వెలుగు : మండల కేంద్రంలో కూలిన ఇండ్లు, రోడ్లు, పంటలను శనివారం కలెక్టర్​పరిశీలించారు.  ఎన్ని ఇండ్లు కూలాయి, ఎన్ని ఎకరాల పంట నష్టం వాటిల్లింది నివేదిక ఇవ్వాలన్నారు.  ఎంపీడీవో సాజిత్ అలీ, ఎమ్మార్వో శ్వేత, ఏపీవో సవిత, ఆర్ఐ హారిక, వ్యవసాయాధికారి నర్సింలు  పాల్గొన్నారు.

కూలిన ఇండ్ల నివేదిక తయారు చేయాలి

బాన్సువాడ, వెలుగు:  వర్షాల కారణంగా కూలిన ఇండ్ల నివేదికను తయారు చేయాలని కలెక్టర్ తహసీల్దార్ వరప్రసాద్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. డ్రైనేజ్, తాగునీటి సమస్యలపై శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ కిరణ్మయి, అధికారులు పాల్గొన్నారు.