గురుకులాల్లో కామన్ డైట్ అమలు చేయాలి : కలెక్టర్ పమేలాసత్పతి

గురుకులాల్లో కామన్ డైట్ అమలు చేయాలి : కలెక్టర్ పమేలాసత్పతి

గంగాధర, వెలుగు: గురుకులాల్లో కామన్​ డైట్​అమలుచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గంగాధర మండలం మహాత్మా జ్యోతీబాపూలే బీసీ బాయ్స్‌‌‌‌‌‌‌‌, మైనార్టీ గర్ల్స్‌‌‌‌‌‌‌‌ గురుకుల స్కూళ్లను మంగళవారం ఆమె సందర్శించారు. బీసీ బాయ్స్‌‌‌‌‌‌‌‌ హాస్టల్‌‌‌‌‌‌‌‌లో తరగతి గదులు, స్టోర్ రూం, వంటగదిని పరిశీలించారు. విద్యార్థులు కూర్చునేందుకు సరఫరా చేసిన గ్రీన్ మ్యాట్లను ఉపయోగించకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారుల నుంచి సరఫరా అయిన ప్రతి వస్తువును విద్యార్థుల కోసం వినియోగించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న పలువురు విద్యార్థులతో మాట్లాడారు. జ్వరం, విరోచనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ వెంట బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్ ఉన్నారు.
  
7 ఇసుకరీచ్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేశాం 

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజల అవసరాల కోసం జిల్లాలో 7 ఇసుక రీచ్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేశామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.  మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఊటూరు1, ఊటూరు-2, చల్లూర్, మల్లారెడ్డిపల్లి, కోర్కల్, కొండపాక పోతిరెడ్డిపల్లి రీచ్‌‌‌‌‌‌‌‌లు ఉండగా.. చేగుర్తి ఇసుక రీచ్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వ అవసరాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు కేటాయించిన్లు చెప్పారు. 

 జగిత్యాల జిల్లా మల్యాల, పెగడపల్లి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అవసరాలకు రామడుగు మండలం మోతెలోని ఇసుక రీచ్ నుంచి 15వేల మెట్రిక్ టన్నుల ఇసుక తీసుకునేందుకు అనుమతించామన్నారు.  సమావేశంలో ఆర్టీవో మహేశ్వర్, మైనింగ్ శాఖ ఏడీ రాఘవ రెడ్డి, ఈఈలు బలరామయ్య, రవీంద్రకిషన్, ఇరిగేషన్ అధికారి జగన్, డీపీవో జగదీశ్వర్, జియాలాజిస్ట్ ప్రసన్న పాల్గొన్నారు.