విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి : పమేలా సత్పతి

విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి  :  పమేలా సత్పతి
  • కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి సూచించారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సిటీలోని సుభాష్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో విద్యార్థులకు ఆల్బెండజోల్‌‌‌‌‌‌‌‌ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 నుంచి 19 ఏండ్ల  వయస్సున్న వారందరికీ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలన్నారు. అనంతరం స్వాతంత్ర్య వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇండిపెండెన్స్ డేను అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 

ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. అంతకుముదు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్నారు.  231  దరఖాస్తులను స్వీకరించి,  ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో వెంకటరమణ, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు  మహేశ్వర్, రమేశ్‌‌‌‌‌‌‌‌, డీఆర్డీవో వి. శ్రీధర్, జె.రవికుమార్ పాల్గొన్నారు.