రిపబ్లిక్ డేకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

రిపబ్లిక్ డేకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి
  •     కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు: జనవరి26న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌‌‌‌లో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలకు పక్కగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం రిపబ్లిక్ డే వేడుకలపై కలెక్టరేట్‌‌‌‌లో సీపీ గౌష్ ఆలంతో కలిసి మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిపబ్లిక్‌‌‌‌ డేకు వేదిక, పార్కింగ్‌‌‌‌, విద్యుత్‌‌‌‌, అలంకరణ, సౌండ్ సిస్టం, తాగునీరు తదితర ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. 

అనంతరం 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌‌‌‌‌‌‌‌ రాణికుముదినితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో కలెక్టర్ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వివరించారు.