విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి : కలెక్టర్ ప్రావీణ్య

విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి : కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 22న జిల్లాలో  మాక్​ఎక్సర్​సైజ్ ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో అనుకోని ప్రమాదాలు సంభవిస్తే సహాయకర చర్యలు చేపట్టడానికి పరిశ్రమలు, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని పరిశ్రమల స్థాయిలకు అనుగుణంగా భద్రతా ప్రమాణాలు పాటించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

ప్రమాదాల నివారణకు అధికారుల బృందాలు తరచూ పరిశ్రమలను తనిఖీ చేస్తూ అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదం జరిగితే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. మాక్​ ఎక్సర్సైజ్ నిర్వహించడం వల్ల విపత్తులను ఎదుర్కొనడంలో ఏ మేరకు సిద్ధంగా ఉన్నామో తెలుస్తుందన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవచ్చన్నారు.  కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ మాధురి, ఎస్పీ పరితోశ్ పంకజ్, ఏఎస్పీ రఘునందన్ రావు, తుల్జానాయక్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు, డీటీవో అరుణ, కలెక్టరేట్ విపత్తుల నిర్వహణ విభాగం పర్యవేక్షకుడు లింగశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

విపత్తుల నిర్వహణకు సిద్ధం: కలెక్టర్​ రాహుల్​రాజ్ 

మెదక్​ టౌన్ :  జిల్లాలో విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని కలెక్టర్​రాహుల్​రాజ్​తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 22న మాక్ ఎక్సర్​సైజ్​ విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. విపత్తుల సమయంలో ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ నగేశ్, ఏఎస్పీ మహేందర్, డీఆర్​వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్​ రావు, జిల్లా అధికారులు నిత్యానంద్, నారాయణ నాయక్, వెంకటయ్య, శ్రీనివాస్​ విజయ్, ఆర్డీవో రమాదేవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.