- కలెక్టర్ ప్రావీణ్య
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ డివిజన్ పరిధిలో వివిధ సంక్షేమ హాస్టల్స్లో కామన్ మెనూ కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. శుక్రవారం నారాయణఖేడ్ టౌన్ లోని గిరిజన బాలికల హాస్టల్ ను అడిషనల్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి తనిఖీ చేశారు.
హాస్టల్లోని కిచెన్, స్టూడెంట్స్ కి అందించే సరుకుల క్వాలిటీని తనిఖీ చేశారు. అనంతరం స్టూడెంట్స్ తో మాట్లాడుతూ.. బాగా చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. డివిజన్ స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీలో గెలుపొందిన స్టూడెంట్స్ కు చిల్డ్రన్స్ డే సందర్భంగా బహుమతులు అందజేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోటీలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయన్నారు. నారాయణఖేడ్ డివిజన్ ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో విద్యా రంగానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
