ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర ఇవ్వండి : కలెక్టర్ ప్రావీణ్య

ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర ఇవ్వండి : కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, వెలుగు: ఇందిరమ్మ చీరల పంపిణీని పారదర్శకంగా జరగాలని, ప్రతీ మహిళకు చీర ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. బుధవారం ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, మహిళా సమాఖ్యలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఆమె మహిళా సమాఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. 

ఎలాంటి విమర్శలు, పొరపాట్లకు తావులేకుండా అర్హులైన ప్రతీ మహిళకు చీర అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికో స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 24,904 మహిళ సంఘాలు, వీటిలో 2,60,692 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఇంకా గ్రూపుల్లో చేరని వారుంటే వెంటనే చేర్పించాలని పేర్కొన్నారు. 

ఘనంగా వయోవృద్ధుల వారోత్సవాలు

వయోవృద్ధులు సమాజానికి జ్ఞాన భాండాగారాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో జిల్లా మహిళా శిశు, వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీపీవో సాయిబాబా, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, డీఈవో వెంకటేశ్వర్లు, వయోవృద్ధుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.