V6 News

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ ప్రావీణ్య

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ ప్రావీణ్య
  •     కలెక్టర్​ ప్రావీణ్య

సదాశివపేట, వెలుగు: మొదటి విడత ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ప్రావీణ్య సూచించారు. సోమవారం సదాశివపేటలోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల 2వ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్​హాజరై ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలిపారు. 

అనంతరం మాట్లాడుతూ పోలింగ్​బూత్​లో తాగునీటి సౌకర్యం, వికలాంగులకు వీల్ చెయిర్​అందుబాటులో ఉంచాలన్నారు. ఎలంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, నోడల్ అధికారి రామాచారి, మాస్టర్ ట్రైనర్ తులసీరామ్ రాథోడ్, శ్రీకాంత్ జోషి, కిష్టయ్య , పీవోలు పాల్గొన్నారు.