ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్ 

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్ 

రామాయంపేట, వెలుగు: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని  కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. శనివారం రామాయంపేట మండలం అక్కన్నపేట కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తేమశాతం రాగానే ధాన్యం తూకం వేయాలన్నారు.

తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. లారీలను ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. కొనుగోళ్లు చేయగానే ఆలస్యం చేయకుండా ఆన్‌‌‌‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని, టార్ఫాలిన్ లను అందుబాటులో ఉంచాలన్నారు.