మనోహరాబాద్ మండలంలో పీహెచ్​సీని తనిఖీ చేసిన కలెక్టర్

  మనోహరాబాద్ మండలంలో పీహెచ్​సీని తనిఖీ చేసిన కలెక్టర్

మనోహరాబాద్, వెలుగు: మండల కేంద్రంలోని పీహెచ్​సీని ఆదివారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను, మందుల గదిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆస్పత్రిలో ఓపీ సేవలు పెంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట డాక్టర్ వినోద్ కుమార్, ఆయుష్ ఫార్మసిస్ట్ సురేశ్,  వైద్య సిబ్బంది ఉన్నారు.