
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి టాస్క్ఫోర్స్టీమ్స్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్రాహుల్రాజ్తెలిపారు. శుక్రవారం ఆయన మెదక్కలెక్టరేట్లో పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి జాయింట్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. టాస్క్ఫోర్స్టీమ్స్విత్తన, ఎరువుల షాపులపై నిఘాపెట్టి తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. కంపెనీ లైసెన్స్, విత్తనాల నాణ్యత ఏదీ లేకున్నా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్నగేశ్, ఏఎస్పీ మహేందర్, డీఏవో విన్సెంట్ వినయ్‌కుమార్, సీఐలు, ఏవోలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఎరువుల షాప్ తనిఖీ చేసిన కలెక్టర్
పాపన్నపేట: పాపన్నపేట మండలంలో కలెక్టర్ రాహుల్ రాజ్విస్తృతంగాపర్యటించారు. మండల కేంద్రంలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని పరిశీలించారు. విత్తనాల క్రయవిక్రయాల రికార్డులు, కంపెనీల పత్రాలు, విత్తన ప్యాకెట్లపై లేబుల్స్, వ్యాపార లైసెన్స్, కొనుగోళ్ల రిజిస్టర్లను, స్టాక్ నిల్వలతో కూడిన ధరల పట్టిక బోర్డును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ధరకు ఆశపడి అనధికారిక డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దన్నారు. రైతులు అధీకృత విత్తన డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని, విధిగా
రైతు సంతకంతో కూడిన రశీదును తీసు
కోవాలన్నారు.