స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్పీడప్ చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్పీడప్ చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  • కలెక్టర్ ​రాహుల్​ రాజ్

మెదక్​ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి  స్కాలర్​షిప్​రెన్యువల్‌, నూతన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం మెదక్​కలెక్టరేట్‌లో  సంక్షేమ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్​కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. 

కలెక్టర్‌ మాట్లాడుతూ..2025-–-26 కు సంబంధించి బయోమెట్రిక్‌ను పూర్తి చేయాలని, గడువు లోగా హార్డ్​కాపీలను సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో సత్వర చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు. 

ఈ-- పాస్‌ లాగిన్‌లో విద్యార్థుల బ్యాంకు వివరాలు తప్పుగా నమోదైతే సరిచేయాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​నగేశ్, ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ‌గిరిజన సంక్షేమ అధికారి నీలిమ,  జిల్లా ఇన్​చార్జి డీఈవో విజయ, ప్రిన్సిపాళ్లు, వసతిగృహాల సంక్షేమాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలి 

శివ్వంపేట: భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని  కలెక్టర్ రాహుల్ రాజ్ తహసీల్దార్ ను ఆదేశించారు. శివ్వంపేట తహసీల్దార్ ఆఫీసును సందర్శించి భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూభూ భారతి, సాదా బైనామా దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించాలని సూచించారు. 

ప్రతి దరఖాస్తుపై పరిశీలన నివేదిక ఉండాలని తిరస్కరణ జరిగితే, కారణాలు తప్పనిసరిగా నమోదు చేయాలని  ఆదేశించారు. పౌరులకు ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 

నవాబ్ పేట గ్రామంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ సమస్యను కలెక్టర్ క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పరిశీలించారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా రెవెన్యూ సర్వే రికార్డులను పరిశీలించి సమగ్ర నివేదికను వారం రోజుల్లో పంపాలని అధికారులను ఆదేశించారు.