లింగరెడ్డిపేట కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

లింగరెడ్డిపేట కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

తూప్రాన్, వెలుగు: మనోహరాబాద్ మండలం లింగరెడ్డిపేటలోని నోబుల్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఓట్ల కౌంటింగ్ ను మూడు ఫేజ్ లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం కౌంటింగ్ లో పాల్గొనే సూపర్​వైజర్స్,  కౌంటింగ్ అసిస్టెంట్స్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో జయచంద్రా రెడ్డి, తహసీల్దార్​చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గణేశ్ రెడ్డి, పీఆర్ఏఈ మధు ఉన్నారు.  

ఎన్నికల కౌంటింగ్​లో ఆర్వోల పాత్ర కీలకం

మెదక్​టౌన్ : కౌంటింగ్ ప్రక్రియలో ఆర్​వోలు, సూపర్​వైజర్లు, అసిస్టెంట్ సూపర్​వైజర్లు, మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. వెస్లీ స్కూల్​లోని మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్​ను అడిషనల్​ కలెక్టర్​ నగేశ్, ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్డీవో రమాదేవిని కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. స్ట్రాంగ్ రూమ్​కు మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ శ్రీనివాస్​రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, రాజిరెడ్డి పాల్గొన్నారు.