మెదక్ లో ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో పూర్తిచేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ లో ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో పూర్తిచేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్​, చేగుంట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లను ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత త్వరగా బిల్లులను చెల్లిస్తామని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. మంగళవారం చేగుంట మండలం పులిమామిడి, బోనాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 9,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 5,000  గ్రౌండింగ్ అయి వివిధ దశల్లో ఉన్నాయని, మిగిలిన ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. 

ఇండ్ల నిర్మాణపు పనులు పూర్తి చేయడంలో జిల్లాను ముందు వరుసలో ఉంచాలని కోరారు. అనంతరం చేగుంట మండలంలోని పులిమామిడిలో అంగన్​వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలుచేయాలన్నారు. అనంతరం అంగన్​వాడీ స్కూల్​ను సందర్శించి ప్రశ్నలు సమాధానాలతో పిల్లల సామర్థ్యాలను పరీక్షించారు.