సీసీ కెమెరాలతో ఆరోగ్య సేవల పర్యవేక్షణ : కలెక్టర్ రాహుల్ రాజ్

సీసీ కెమెరాలతో ఆరోగ్య సేవల పర్యవేక్షణ : కలెక్టర్ రాహుల్ రాజ్
  • కలెక్టర్ రాహుల్ రాజ్ 

చిన్నశంకరంపేట, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కలెక్టరేట్ నుంచి పర్యవేక్షిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. ఆదివారం మండల కేంద్రంలో ఉన్న పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్, మందుల స్టాక్ ను పరిశీలించారు. 

వైద్య సేవలపై ఆరా తీశారు.  కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా వైద్య వృత్తి పేరిట నకిలీలు ఉంటే చట్టరీత్యా శిక్షిస్తామని తెలిపారు. అనంతరం అంబాజీపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసి డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యేలా చూడాలన్నారు.