ఉల్లాస్ ను పకడ్బందీగా అమలుచేయాలి​ : రాహుల్​రాజ్

ఉల్లాస్ ను పకడ్బందీగా అమలుచేయాలి​ : రాహుల్​రాజ్
  • కలెక్టర్​ రాహుల్​రాజ్

​మెదక్ ​టౌన్, వెలుగు: జిల్లాలో ఉల్లాస్​(అండర్​స్టాండింగ్​ఆఫ్​లైఫ్​లాంగ్​లెర్నింగ్​ఫర్​ఆల్​సొసైటీ) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మెదక్​కలెక్టరేట్​లో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్​టెన్త్​లో మంచి ఫలితాలు సాధించినందుకు అధికారులను అభినందించారు. విద్యాపరంగా జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. బడిబాటలో భాగంగా ఏ ఒక్క స్టూడెంట్​బడి బయట ఉండకుండా చూడాలన్నారు. 

ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించి స్వయం సహాయక బృందాల సహకారంతో అక్షరాస్యులుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఏఐ సహకారంతో స్టూడెంట్స్​కు విద్యను అందించాలన్నారు. ప్రతి శుక్రవారం పేరెంట్స్ సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు చేయాలన్నారు. అంగన్​వాడీ సూపర్​వైజర్లు, టీచర్లు టెన్త్​పాసైన బాలికలందరిని పైచదువులకు వెళ్లేలా ప్రోత్సహించాలని, బాల్యవివాహాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్, డీడబ్ల్యూవో హైమావతి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శనమూర్తి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ రామేశ్వర ప్రసాద్, డీఎస్ వో రాజిరెడ్డి, ఏఎస్​వో నవీన్ పాల్గొన్నారు. 

శిశు మరణాలు తగ్గించాలి

జిల్లా వ్యాప్తంగా శిశువుల అక్రమ దత్తత, మరణాలను తగ్గించాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​సూచించారు. మెదక్​ కలెక్టరేట్​లో మహిళా శిశు సంక్షేమ శాఖ పురోగతిపై సూపర్​వైజర్లు, అంగన్​వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్​ మాట్లాడుతూ.. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలన్నారు. గర్భిణులు అన్ని రకాల పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. టిఫా స్కానింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉందని గర్భిణులు దీనిని ఉపయోగించుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, సీడీపీవో హేమభార్గవి, అంగన్​వాడీ సూపర్​వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు.