భూసమస్యలు ఉన్నవారు అప్లై చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

భూసమస్యలు ఉన్నవారు అప్లై చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

చిలప్ చెడ్, వెలుగు: భూసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూభారతి చట్టం అమలులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన చిలప్ చెడ్ మండలంలో మంగళవారం బండపోతుగల్, లింగోజిగూడలో రెవెన్యూ సదస్సులు కొనసాగాయి. బండపోతగల్​లో ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ సహదేవ్​తో కలిసి కలెక్టర్ స్వయంగా దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో  దరఖాస్తులు ఇవ్వాలన్నారు. అధికారులు వాటిని పరిశీలించి, వెరిఫికేషన్ ద్వారా అర్హతను నిర్ధారించిన తర్వాత వారికి ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు.

 ఈ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులకు సంబంధించి  దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రెండో  రోజు లింగోజిగూడలో 20, బండపోతుగల్ లో 48 కలిపి మొత్తం 68 ఆర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.

కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలి

మనోహరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని దండుపల్లిలో పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్​మాట్లాడుతూ సేకరించిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకి తరలించాలని  సూచించారు. చుట్టు పక్కల ఎన్ని గ్రామాల నుంచి ధాన్యం వస్తుందనే వివరాలను రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, పాక్స్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్​చంద్ర శేఖర్ రెడ్డి, ఆర్ఐ దీక్షిత్ పాల్గొన్నారు.