ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి : రాహుల్​ రాజ్​

ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి : రాహుల్​ రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ పార్లమెంట్​ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​రాహుల్​రాజ్​ అన్నారు. శుక్రవారం జిల్లాలోని పీవో, ఏపీవోలు పోలింగ్ సిబ్బందికి మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రెండోసారి నిర్వహించిన ఎన్నికల శిక్షణా కార్యక్రమంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ట్రైనింగ్ క్లాస్​లకు తప్పని సరిగా హాజరు కావాలన్నారు.

మాక్ పోలింగ్ ఉదయం 5.30 గంటలలోగా పూర్తి చేయాలని, కనీసం ఇద్దరు ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ రోజు ఈవీఎంలు  తీసుకొని పోలింగ్ డే పూర్తయిన తర్వాత సాయంత్రం కాగానే తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత పీవోలదేనని చెప్పారు. కార్యక్రమాన్ని సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పరిశీలించారు. మెదక్ ఆర్డీవో  రమాదేవి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పోలింగ్ అధికారులు, సహాయక పోలింగ్ అధికారులు , ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

పోస్టల్ బ్యాలెట్ల సరళి పరిశీలన

పోస్టల్ బ్యాలెట్​ను వినియోగించుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. శుక్రవారం కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసినని అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. కార్యక్రమం లో ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్​ పూర్తి

మెదక్​పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్​ప్రక్రియ పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఎన్నికల సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటి,  రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో రెండో ఈవీఎంల ర్యాండమైజేషన్​ప్రక్రియను పూర్తి చేశామన్నారు. 2,124  పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 7,961 బ్యాలెట్,  2,652 కంట్రోల్ యూనిట్లు, 2,970 వీవీ ప్యాట్ల రెండో ర్యాండమైజేషన్​ ద్వారా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించడం జరిగిందని వివరించారు.