బోర్డర్ చెక్ పోస్ట్ ల్లో తనిఖీలు పక్కగా చేపట్టాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

బోర్డర్ చెక్ పోస్ట్ ల్లో తనిఖీలు పక్కగా చేపట్టాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  •     కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్ పోస్టుల్లో వాహనాల తనిఖీ పక్కాగా చేపట్టాలని  రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల కు సూచించారు. శుక్రవారం హవేలీ ఘనపూర్ మండల పరిధి పోచమ్మ రాల్ వద్ద ఏర్పాటుచేసిన జిల్లా బార్డర్ చెక్ పోస్ట్ ను ఆర్డీవో రమాదేవితో కలసి పరిశీలించారు. రిజిస్టర్ లను చెక్​చేసి స్టాటిస్టిక్ సర్వే లెన్స్ టీమ్ లకు  దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల సందర్భంగా నగదు, బంగారం పంపిణీ చేసే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా చెక్​ చేయాలన్నారు. ఈ  ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు లేకుండా భారీ ఎత్తున నగదు, బంగారం తరలిస్తే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలన్నారు. సీజ్ చేసిన వస్తువులకు రశీదుఅందజేయాలన్నారు.

వన్య ప్రాణులకు ఇబ్బంది కలిగించొద్దు

 జిల్లా సరిహద్దులోని పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ లోని వన విజ్ఞాన కేంద్రాన్ని  కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. సఫారీ వాహనంలో తిరిగి జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని, నెమళ్లు, మనుబోతులు, వివిధ రకాల పక్షులను చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వన్య ప్రాణులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, వాటికి  ఆహారం, తాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ ఆఫీసర్లకు సూచించారు. ఆయన వెంట మెదక్ ఆర్డీవో రమాదేవి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, బీట్ ఆఫీసర్ ప్రసాద్ గౌడ్ ఉన్నారు.