ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  •     జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాహుల్​ రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్​ కలెక్టరేట్ లో కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్ నగేశ్, డీఆర్​వో భుజంగరావు, అన్ని విభాగాల ఉద్యోగులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ  చేశారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ..16 వ జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా 'నా భారత్ - నా ఓటు' అనే నినాదంతో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. 25న ఓటర్ నమోదుపై ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఓటరు ప్రతిజ్ఞ చేయాలని, సంబంధిత ఫొటోలు, వీడియోలను ఆయా సోషల్ మీడియా గ్రూప్​ల్లో అప్​లోడ్ చేయాలని ఆదేశించారు. 

ఎన్నికల నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి

ఎన్నికల నిబంధనలపై అధికారులకు అవగాహన ఉండాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​సూచించారు. మున్సిపాలిటీ ఎన్నికల విధులు నిర్వహించే ఆర్​వో, ఏఆర్​వోలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం మాట్లాడారు. మెదక్​ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 15 0 పోలింగ్ కేంద్రాలు, 75 వార్డులు ఉన్నాయని  ఒక ఆర్​వోకు 3 పోలింగ్ కేంద్రాలు అప్పగించినట్లు చెప్పారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్​నగేశ్, అధికారులు రాజిరెడ్డి, మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఆర్​వోలు, ఏఆర్​వోలు పాల్గొన్నారు. 

ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి

సర్పంచులు తమ గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్​సూచించారు. మెదక్​లోని డిగ్రీ కాలేజీ ఆవరణలో మొదటి విడత సర్పంచుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమన్నారు. అనంతరం శిక్షణ పొందిన సర్పంచులకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో డీపీవో యాదయ్య, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో  శ్రీనివాసరావు, డీఎల్​పీవోలు సాయిబాబా, సురేశ్​బాబు, అధికారులు తిరుపతిరెడ్డి, మోజం హుస్సేన్ పాల్గొన్నారు.