
నిజామాబాద్, వెలుగు : గోవులను వధించడం 1977 చట్టం ప్రకారం నేరమని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శనివారం జంతు సంక్షేమం, గోవధ నిషేధ సమన్వయ కమిటీ మీటింగ్‌లో కలెక్టర్మాట్లాడారు. గోవులతో పాటు ఒంటెల వధింపుపై స్టేట్‌లో నిషేధం కొనసాగుతుందన్నారు. బక్రీద్ పేరుతో జరిగే గోవుల రవాణాపై ఆఫీసర్స్ ఫోకస్ పెట్టాలన్నారు. వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేసే పశువులను మాత్రమే స్లాటర్ హౌజ్‌లో వధించాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ కోయడానికి వీలులేదన్నారు.
బార్డర్లో చెక్ పోస్టుల ఏర్పాటు : సీపీ
బక్రీద్ పేరుతో పక్క రాష్ట్రాల నుంచి పశువుల అక్రమ రవాణా జరగకుండా బార్డర్లో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశామని సీపీ సాయి చైతన్య తెలిపారు. కందకుర్తి, సాలూరా, పోతంగల్, ఖండ్‌గావ్‌లో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, సాటాపూర్, యంచ, ఇందల్వాయి, ఉమ్మెడ, జన్నేపల్లి, మామిడిపల్లి విలేజ్‌లలో అంతర్జిల్లా చెక్ పోస్టులు పెట్టామన్నారు. రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్ పోర్ట్ శాఖ ఆఫీసర్లు సమన్వయంతో పని చేస్తే ఫలితాలు వస్తాయన్నారు.
పట్టుబడిన గోవులను గ్రాసం, తాగునీరు ఉన్న షెల్టర్లకు తరలించాలన్నారు. జంతు సంరక్షణ చట్టానికి లోబడి పశువుల క్రయవిక్రయాలు నిర్వహించాలని, వ్యర్థాలను జనావాసాలకు దూరంగా పడేయాలన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక కమిషనర్ దిలీప్‌కుమార్, ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ ఉమామహేశ్వర్రావు, ట్రాన్స్‌కో ఎస్ఈ రవీందర్, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.